: కిమ్ జాంగ్ ఉన్ కు అమెరికా కొత్తగా పెట్టిన షరతులివే!

అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాకు అమెరికా పలు షరతులు విధించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధికార ప్రతినిధి నిక్కీ హేలీ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో అమెరికా లక్ష్యంగా అయినా, అమెరికా గడ్డను లక్ష్యంగా చేసుకుని అయినా ఎలాంటి అణ్వస్త్ర ప్రయోగం చేసినా ఉత్తరకొరియాపై ఎలాంటి దాడులు చేసేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు.

కిమ్ జాంగ్ దుడుకు చర్యలను సహించేది లేదని ఆమె తెలిపారు. ఏదో ఒక కారణం లేకుండా అమెరికా, ఉత్తర కొరియాపై దాడికి దిగదని ఆమె అన్నారు. తమ స్థావరాలు కానీ, సైనికులపై కానీ కిమ్ దాడి చేస్తే మాత్రం సహించేది లేదని ఆమె తేల్చిచెప్పారు. 'ఎలాంటి అణ్వస్త్ర పరీక్షలు చేయొద్దు, ఎలాంటి అణ్వస్త్ర దాడులు చేయొద్దు, మిలటరీ చర్యలకు పాల్పడొద్దు' అని కిమ్ కు షరతులు విధిస్తున్నామని ఆమె తెలిపారు. అయితే వీటిని కిమ్ జాంగ్ ఉన్ పట్టించుకుంటాడా? అన్నదే అసలు సమస్య. 

More Telugu News