: ఏం జరుగుతుందో తెలియక...రెండు గంటలు బెంబేలెత్తిపోయిన దుబాయ్ షాపింగ్ మాల్ సందర్శకులు

దుబాయ్ లో షాపింగ్ అనుభవాన్ని చవిచూడండి అంటూ పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ తో పాటు, విమానయాన సంస్థలు కూడా ప్రచారం చేస్తుంటాయి. దుబాయ్ లో షాపింగ్ అంత బాగుటుందని పేరు. కనీసం పిచ్చి మొక్కలు కూడా మొలవని దుబాయ్ లో దొరకని వస్తువు ఏదీ ఉండదని షాపింగ్ కు వెళ్లిన వారు, దుబాయ్ లో ఉద్యోగాలు చేసేవారు చెబుతుంటారు. అలాంటి దుబాయ్ లోని రద్దీగా ఉండే ఒక షాపింగ్ మాల్ లో గత సాయంత్రం సరిగ్గా 7:13 నిమిషాలకు కరెంట్ పోయింది. దీంతో షాపింగ్ మాల్ లో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. లిఫ్ట్ లలో ఉన్నవాళ్లు లిఫ్ట్ లలో, ఎస్కలేటర్ లలో ఎస్కలేటర్ లపై ఇలా ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు.

దీంతో కొంత మంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ల ద్వారా సెల్ ఫోన్ లైట్లలో కొంత మంది బయటపడ్డారు. ఇలా సుమారు రెండు గంటలు కరెంట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అనంతరం సుమారు 8:47 నిమిషాలకు మళ్లీ కరెంట్ వచ్చింది. ఈ సమయంలో ఉగ్రదాడి జరిగిందేమోనని భయపడ్డామని చాలా మంది పేర్కొనడం విశేషం. దుబాయ్ లో సుమారు 1000 వరకు సంస్థలు కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా, విపత్కర పరిస్థితుల్లో రక్షణ చర్యలు ఎవరూ చేపట్టకపోవడం అందర్నీ ఆందోళనలోకి నెడుతోంది. దుబాయ్ లో విద్యుత్ సమస్య అస్సలు ఉండదని, అందుకే సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. 

More Telugu News