: పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లో ఎట్టకేలకు శివపూజలు

దేవాలయ భూమిపై వివాదం ఏర్పడటంతో ఇరవయ్యేళ్ళుగా పూజలకు నోచుకోని పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌ ఖైబర్ పష్తూన్‌కాలోని శివజీ దేవాలయంలో ఎట్ట‌కేల‌కు ఇక‌పై పూజ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ దేవాల‌యంలో పూజలు చేసుకునేందుకు హిందువులకు పెషావర్ హైకోర్టు నుంచి అనుమతి వ‌చ్చింది. ఆ దేవాల‌యంలో పూజ‌ల‌కు అనుమ‌తి ఇవ్వాలిని కోరుతూ బాల్మాయ‌క్ అనే హిందూ స్వ‌చ్ఛంద‌ సంస్థ వేసిన పిటిష‌న్ సుదీర్ఘంగా విచారించిన న్యాయ‌స్థానం ఎట్ట‌కేల‌కు అందుకు అనుకూలంగా తీర్పునివ్వ‌డంతో అక్క‌డి హిందువులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వివాదాస్పద‌ భూమిని చట్టబద్ధమైన యజమాని నుంచి తమ సంస్థ లీజుకు పొందినట్లు కోర్టుకు తెలిపిన ఆ స్వ‌చ్ఛంద‌ సంస్థ‌... భారత ఉపఖండం విభజన జరిగినప్పటి నుంచి ఈ దేవాలయాన్ని తాము సంరక్షిస్తున్నట్లు చెప్పింది. ఈ ఆల‌యాన్ని 175 ఏళ్ల క్రితం నిర్మించార‌ని పేర్కొంది. బ్రిటిష్ పాలనలో ఈ దేవాలయాన్ని గూర్ఖా రైఫిల్స్‌కు ఇచ్చారని కోర్టుకు చెప్పింది. దేశ విభజన తర్వాత బాల్మాయక్ సభ ఈ దేవాలయం బాధ్యతలను స్వీకరించింద‌ని, అప్ప‌టి నుంచి 1960 వరకు ఈ దేవాల‌యాన్ని సంర‌క్షించింద‌ని తెలిపింది. ఇందుకు సంబంధించి అన్ని వాదనలు విన్న అక్కడి హై కోర్టు తమ తీర్పుని ఇచ్చింది.

More Telugu News