: చైనాలో పలు ‘ముస్లిం’ పేర్లపై నిషేధం!

చైనా తమ దేశంలో ముస్లిం ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో భాగంగా పలు ముస్లిం పేర్లపై నిషేధం విధించింది. ముస్లిం ప్రజలు అధికశాతం ఉన్న జిన్జియాంగ్ ప్రాంతంలో ఈ నిషేధం వర్తిస్తుందని ఆ ప్రాంత అధికారులు పేర్కొన్నారు. ముస్లిం మతానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పదాలు, ముఖ్యంగా మతపరంగా ప్రేరేపించే, అత్యుత్సాహం కనబరిచే పదాలను చిన్నారులకు నామకరణం చేయడాన్ని నిషేధించారు. వాటిలో..‘ఇస్లాం, ఖురాన్, మక్కా, జీహాద్, ఇమామ్, సద్దాం, హజ్, మదీనా’ వంటి పదాలను చైనీస్ అధికార పార్టీ నిషేధించినట్టు రేడియో ఫ్రీ ఆసియాలో ఓ అధికారి పేర్కొన్నారు. నిషేధించిన పేర్లతో ఉన్న చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోరని, సామాజిక సేవలు లభించవని పేర్కొన్నారు. కాగా, నిషేధించిన పేర్ల పూర్తి జాబితా ఇంకా విడుదల కావాల్సి ఉంది.

More Telugu News