: నకిలీ పాస్ పోర్టు కేసులో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు!

నకిలీ పాస్ పోర్టు కేసులో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారయింది. ఈ మేరకు పటియాలా హౌస్ కోర్టు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. మారు పేరుతో, ఫోర్జరీ పత్రాలతో ఛోటా రాజన్ నకిలీ పాస్ పోర్టు పొందినట్టు గత ఏడాది జూన్ 8న సీబీఐ కోర్టులో అతనిపై అభియోగాలు నమోదయ్యాయి.

రాజన్ తో పాటు పాస్ పోర్టు అధికారులు దీపక్ నట్వర్ లాల్ షా,  లలిత లక్ష్మణన్, జయశ్రీ దత్తాత్రేయ్ రహతెలపై కేసు నమోదైంది. రాజన్ కు వీరు సహకరించారంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గుర్నీ కూడా కోర్టు నిన్న దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. తలో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున జరిమానా విధించింది.

More Telugu News