: విదేశీయులు లేకుంటే ఆపిల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ ఎక్కడుండేవి?: కొలంబియాలో ప్రశ్నించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్

హెచ్ 1-బీ వీసా నిబంధనలను కఠినం చేస్తూ, అమెరికా తీసుకు వచ్చిన నూతన విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విమర్శించారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ లో భారత ఆర్థిక విధానాలపై రాజ్ సెంటర్ స్పాన్సర్ చేసిన కార్యక్రమంలో ఉర్జిత్ పాల్గొని ప్రసంగించారు. అమెరికా తదితర దేశాలు రక్షణవాద  విధానాలను పాటిస్తున్నాయని ఆరోపించిన ఆయన, పరస్పర సహకారం, విదేశీ ఉద్యోగుల వల్లనే యూఎస్ దిగ్గజ కంపెనీలు నిలబడ్డాయని చురకలు అంటించారు.

 ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యతగల ఉద్యోగులను తీసుకోవడం వల్లే ఆపిల్, సిస్కో , మైక్రోసాఫ్ట్, ఐబిఎమ్ వంటి కంపెనీలు సత్తా చాటాయని, విదేశీయులే లేకుంటే ఇవన్నీ ఎక్కడుండేవని ప్రశ్నించారు. సంపద సృష్టికర్తలన్న పేరును తెచ్చుకున్న దేశాలే ఈ తరహా కఠిన వీసా విధానాలను అవలంబించడం తగదని సూచించారు. సమర్థవంతమైన మార్గంలో వెళ్లాలే తప్ప, వృద్ధికి తీరని నష్టం కలిగించే చర్యలు కూడదని సలహా ఇచ్చారు. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఉర్జిత్‌ అన్నారు.

More Telugu News