: పాయింట్ పడిందా?... కౌన్సెలింగ్ కు వెళితే మూడు పాయింట్ల ఉపశమనం!

తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ చెప్పేలా కీలకమైన పాయింట్ల విధానాన్ని వెంటనే అమలు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాహనదారులు చేసే తప్పులకు పాయింట్లను ఇస్తూ, 12 పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్సులను ఏడాది పాటు సస్పెండ్ చేసేలా నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో తాము చేసిన తప్పుకు పాయింట్లు పెరుగుతున్నాయని భయపడుతున్న వారికి కాస్తంత ఊరటనిస్తూ, ఓ అంశాన్ని జీవోలో చేర్చింది. చేసిన తప్పులకు ఎన్ని పాయింట్లు ఉన్నప్పటికీ, పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్ కు ఒకసారి హాజరైతే మూడు పాయింట్లను తగ్గిస్తారు. రెండేళ్ల వ్యవధిలో గరిష్టంగా రెండు సార్లు మాత్రమే కౌన్సెలింగ్ కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఉల్లంఘనులను గుర్తించి, పాయింట్లు వేసేందుకు అన్ని ప్రధాన రహదారులు, కూడళ్లతో పాటు గల్లీలోనూ నిఘాను ముమ్మరం చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

More Telugu News