: పోలీసులు 'వీడియో' చూపించడంతో దిమ్మతిరిగి నిజం చెప్పిన దినకరన్!

ఎలక్షన్ కమిషన్ కు లంచం ఇవ్వజూపిన కేసులో గత మూడు రోజులుగా ఢిల్లీ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, తొలుత నిజం ఒప్పుకోకపోయినా, ఆపై పోలీసులు చూపిన వీడియో సాక్ష్యంతో దిమ్మతిరిగిపోయి నిజం చెప్పాడు. దినకరన్, సుకేష్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోను పోలీసులు చూపించడంతో దినకరన్ షాక్ అయినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తొలుత మధ్యవర్తి సుకేష్ ఎవరో తెలియదని, ఆపై ఆయనో హైకోర్టు న్యాయమూర్తిగా భావించి మాట్లాడానని చెప్పిన దినకరన్, ఆపై సుకేష్ తో ఉన్న పరిచయాన్ని అంగీకరించాడు.

సుకేష్ తో పరిచయం, అది ఎలా కొనసాగింది? డబ్బును ఢిల్లీకి ఎలా పంపించారు? ఎవరి ద్వారా ఎన్నికల కమిషన్ కు ఇవ్వాలని అనుకున్నారు? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఇత్యాది విషయాలను పూస గుచ్చినట్టు చెప్పేశాడు. దీంతో ఈ కేసులో జోక్యం ఉన్న మరింత మందిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

More Telugu News