: 24 మంది జవాన్ల మృతిపై మోదీ తీవ్ర‌ దిగ్భ్రాంతి.. వారి త్యాగం ఊరికేపోనివ్వబోమని వ్యాఖ్య

చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా జిల్లాలో ఈ రోజు మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డి, 24 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల ప్రాణాలు తీసిన విష‌యం తెలిసిందే. మ‌రికొంత మంది జ‌వాన్లు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మావోయిస్టుల ఘాతుకాన్ని ఓ పిరికిపందల చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. జ‌వాన్ల త్యాగాన్ని ఊరికేపోనివ్వ‌బోమ‌ని ఆయ‌న అన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు ఈ అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు జవాన్లు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు. మావోయిస్టులు మ‌తిలేని చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  





More Telugu News