: మెదడుకు మేలు చేసే చాక్లెటు!

చాక్లెట్లు తినండి.. మెదడుకు మేలు చేస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే, అన్ని రకాల చాక్లెట్లు కాదు.. ముదురు గోధుమ వర్ణపు చాక్లెట్లు మాత్రమే మంచివట! ఎందుకంటే, వయసు పైబడటం ద్వారా సంక్రమించే ఒత్తిడి, శరీర అవయవాల వాపులకు చాక్లెట్లు చెక్ పెడతాయని అమెరికాలోని కాలిఫోర్నియా వర్శిటీ నిపుణులు చెబుతున్నారు. ఎలుక పిల్లలపై పరిశోధన చేపట్టిన అనంతరం ఈమేరకు తాము ఓ అవగాహనకు వచ్చామన్నారు. చాక్లెట్లలో కనిపించే ఎపికాటెచిన్ (ఈపీఐ) ఫ్లేవనాల్ పై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. దీనిని రెండు వారాల పాటు తీసుకుంటే కనుక ఒత్తిడి, వాపులు తగ్గుతాయని అన్నారు. అంతేకాకుండా, జ్ఞాపకశక్తి పెరిగేందుకు, ఒత్తిడి తగ్గేందుకు, అల్జీమర్స్, ఇతర నాడీ సంబంధిత రుగ్మతల కారణంగా తలెత్తే సమస్యలను నియంత్రించుకోవచ్చని తెలిపారు.

More Telugu News