: చంద్రబాబు చేతుల మీదుగా పరిహారం అందుకున్న వీఆర్ చిట్స్ బాధితులు

కొన్నేళ్ల క్రితం విశాఖలో బోర్డు తిప్పేసిన వీఆర్ చిట్స్ బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై తన చేతుల మీదుగా బాధితులకు పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వీఆర్ చిట్స్ పై ప్రతి కేబినెట్ సమావేశంలోనూ ఆరా తీశానని అన్నారు. వీఆర్ చిట్స్ బాధితులకు ఎంతో కొంత న్యాయం చేశామని, ప్రజలను వీఆర్ చిట్స్ బాధితులు చైతన్య పరచాలని సూచించారు.

వీఆర్ చిట్స్ ఒక ప్రైవేటు ఏజెన్సీ అని, అగ్రిగోల్డ్, అభయగోల్డ్, బొమ్మరిల్లు లాంటి కంపెనీలు పెద్ద ఎత్తున డిపాజిటర్లను మోసం చేశాయని, లక్షల మంది బాధితుల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. ఎక్కువ వడ్డీలకు ఆశపడి ప్రజలు మోసపోతున్నారని అన్నారు. కాగా, వీఆర్ చిట్ ఫండ్స్ భారీ ఎత్తున భవనాలు కొనుగోలు చేసి, పదేళ్ల క్రితం ఐపీ పెట్టింది. దీంతో, ఈ సంస్థ ద్వారా మోసపోయిన ఉత్తరాంధ్ర బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ క్రమంలో ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేసి, సదరు సంస్థ ఆస్తులను సీజ్ చేసింది. ఆ తర్వాత, సంస్థ ఆస్తులను వేలం వేసి వచ్చిన డబ్బును బాధితులకు పరిహారంగా అందజేశారు.  

More Telugu News