: తయారీకి రూ. 19,500, అమ్మేది రూ. 57,900... గెలాక్సీ ఎస్8పై సంచలన నిజాలు వెల్లడించిన ఐహెచ్ఎస్!

శాంసంగ్ సంస్థ నుంచి ప్రతిష్ఠాత్మకంగా విడుదలైన గెలాక్సీ ఎస్8 గురించిన ఆసక్తికర సమాచారాన్ని ఐహెచ్ఎస్ మార్కెట్ ఓ నివేదికలో తెలిపింది. ఈ ఫోన్ తయారీకి అయిన ఖర్చు వివరాలను పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం ఎస్8 స్మార్ట్ ఫోన్ తయారీకి రూ. 19,500 కాగా, దీన్ని రూ. 57,900కు అమ్ముతున్నారని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, విడి భాగాలను అమర్చేందుకు అయిన ఖర్చు రూ. 392 అని, గెలాక్సీ ఎస్7 కన్నా రూ. 2,800 ఎక్కువ ఖర్చు పెట్టారని, ఇదే సమయంలో ఎస్ 7 ఎడ్జ్ తో పోలిస్తే రూ. 2,300 తక్కువని, బ్యాటరీ ధర కేవలం రూ. 291 మాత్రమేనని వెల్లడించింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ నోట్ 7ను తయారీ ఖర్చుతో పోలిస్తే రూ. 26,700 అధికంగా అమ్ముతున్నారని, ఇదంతా కంపెనీకి లాభంగా మిగులుతుందని భావించలేమని వెల్లడించింది. దీనిలోనే మార్కెటింగ్, పన్నులు, రీటెయిల్ మార్జిన్ వంటి అంశాలుంటాయని తెలిపింది.

More Telugu News