: కష్టపడాలంటే రాజమౌళి వెనక వెళ్లండి...కంఫర్ట్ కావాలంటే నా వెనుక రండి అని ప్రభాస్ అన్నాడు: రాజమౌళి

ప్రభాస్ అపరిచితుడిలాంటి వాడని రాజమౌళి తెలిపాడు. సినిమా కోసం ప్రభాస్ ఎంత కష్టపడతాడో రియల్ లైఫ్ లో అంత బద్ధకస్తుడని రాజమౌళి అన్నాడు. ఈ సందర్భంగా ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నాడు. ''బాహుబలి: ది బిగెనింగ్' సినిమా విడుదలైన తరువాత ముంబై నుంచి హైదరాబాదు వచ్చేందుకు అంతా సిద్ధమై ముంబై ఎయిర్ పోర్టుకు బయల్దేరాం. ప్రభాస్ అందరికంటే ముందే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు... నిర్మాత శోభు ఫోన్ చేసి, ప్రభాస్ ఎక్కడున్నావు? అని అడిగితే చెక్ ఇన్ పక్కనే ఉన్న లాంజ్ లో ఉన్నానని సమాధానం చెప్పాడు. ఇన్నిసార్లు ముంబై ఎయిర్ పోర్ట్ కి వెళ్లినా తాము దానిని గమనించలేదు. అక్కడే తిరుగుతుంటే ప్రభాస్ వచ్చి లాంజ్ లోకి తీసుకెళ్లాడు.

దీంతో అంతా అక్కడికి వెళ్లాం.. విమానం బయల్దేరేందుకు ఇంకా 20 నిమిషాలే ఉంది... పద చెకిన్ కి వెళ్దామని నేను తొందరపడితే... టీమ్ మొత్తాన్ని ఆపి... కష్టపడాలంటే రాజమౌళి వెనక వెళ్లండి...కంఫర్ట్ కావాలంటే నా వెనుక రండి అని అన్నాడు. ఇంతలో ఒక అధికారి వచ్చి ఇంకా 15 మంది ఉన్నారని తెలిపాడు... అప్పుడు ప్రభాస్ లైన్ లో ఐదుగురు ఉన్నప్పుడు చెప్పండి... అని అతనిని పంపేశాడని, తాను మాత్రం ఇంకా 15 నిమిషాలే ఉంది...ప్రభాస్ తో ఉంటే కష్టమే, రండి అని నేను వెళ్లిపోయి క్యూలో నిల్చుంటే... తీరిగ్గా వచ్చిన ప్రభాస్...చెప్పానా? ముందే వస్తే లైన్ లో క్యూలో నిల్చోవాలని' అన్నాడని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. అంత రాయల్ గా, దర్జాగా ప్రభాస్ ఉంటాడని ఆయన చెప్పారు. 

More Telugu News