: తొలుత ఎంచుకున్న కాలేజీలో చేరకుంటే మూడేళ్ల డిబార్, రూ. 3 లక్షల ఫైన్... చంద్రబాబు సర్కారు కొత్త నిబంధనతో పీజీ మెడికల్ విద్యార్థుల్లో గుబులు!

పీజీ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి చంద్రబాబు సర్కారు తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో విద్యార్థుల గుండెల్లో గుబులు మొదలైంది. పీజీ విద్యార్థులు తొలుత ఎంచుకున్న కాలేజీలో తప్పనిసరిగా చేరాల్సిందే. తొలుత ఒక కాలేజీని ఎంచుకుని, ఆపై మరో మంచి కాలేజీలో సీటుంది కదాని అక్కడ కౌన్సెలింగ్ కు వెళ్దామంటే కుదరదు. వచ్చిన సీటులో చేరకపోతే మూడు సంవత్సరాల పాటు డీబార్ తో పాటు రూ. 3 లక్షల జరిమానా చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన రిపోర్టును అనుసరించి, పాత నిబంధనలను సవరించి, కఠిన నిబంధనలు చేరుస్తూ, ఈ మేరకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం వెలువరించింది.

More Telugu News