: తొమ్మిదేళ్లు మాట్లాడకుండా, ఇప్పుడు తెరపైకి వచ్చిన కన్నడ సంఘాల వెనుక బయ్యర్ల మాఫియా హస్తం!

సుమారు రెండేళ్ల క్రితం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలైంది. అంతకుముందు ఎప్పుడో ఏడేళ్ల క్రితం తమిళ నటుడు సత్యరాజ్ కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, వారిని కుక్కలతో పోల్చిన మాట వాస్తవం. ఆపై ఆయన చిత్రాలు ఎన్నో కర్ణాటకలో విడుదల అయ్యాయి. అప్పుడెప్పుడూ వ్యక్తంకాని అభ్యంతరాలు, 'బాహుబలి-2' సమయంలో తెరపైకి రావడం వెనుక కన్నడ బయ్యర్ల మాఫియా హస్తం ఉన్నట్టు తెలుస్తోంది.

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించుకున్న ఇతర భాషా చిత్రం బాహుబలి మొదటి భాగం మాత్రమే. ఈ చిత్రం రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు సుమారు రూ. 35 కోట్ల వరకూ వసూలై లాభాలను పండించింది. ఇక రెండో భాగాన్ని దక్కించుకోవడం కోసమూ కన్నడనాట ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ప్రయత్నించినా, హక్కులను ఎవరికీ ఇవ్వకుండా ఎన్ఎం ఎంటర్ టెయిన్ మెంట్ ద్వారా నిర్మాతలు సొంతంగా విడుదల చేసేందుకే నిర్ణయించుకున్నారు. ఇదే బయ్యర్లకు ఆగ్రహాన్ని తెప్పించి, తొమ్మిదేళ్ల నాటి సత్యరాజ్ వ్యాఖ్యలను తెరపైకి తెచ్చాయని అభిప్రాయపడుతున్నారు.

More Telugu News