: 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తగ్గిన లగ్జరీ కార్ల ధరలు

బ్రెగ్జిట్ తదనంతర పరిణామాలు యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాయో తెలియదు కానీ, పౌండ్ విలువ క్షీణించడంతో భారత్ లో లగ్జరీ కార్ల ధరలు ఒక్కసారిగా భారీ ఎత్తున తగ్గాయి. ఏడాది వ్యవధిలో రూపాయితో పౌండ్ విలువ 20 శాతం క్షీణించింది. దీనికి తోడు వినియోగదారులను ఆకర్షించేందుకు రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్, ఫెరారీ వంటి సంస్థలు తమ కార్ల ధరలను భారీ ఎత్తున 5 నుంచి 15 శాతం వరకు తగ్గించాయి. దీంతో ఒక్కసారిగా ఆకాశంలో ఉన్న లగ్జరీ కార్ల ధరలు భారీ ఎత్తున తగ్గాయి. ఈ సంస్థలు తయారు చేసే కార్లు 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా తగ్గడం విశేషం.

ఆ కార్ల ధరల వివరాలు...రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు ధర 1.35 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం ఈ కారు ధర 1.04 కోట్ల రూపాయలు కావడం విశేషం. అలాగే రేంజ్ రోవర్ వోగ్ కారు ధర గతంలో 1.97 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం దీని ధర 1.56 కోట్లు కావడం విశేషం. ఫెరారీ 488 లగ్జరీ కారు ధర గతంలో 3.9 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం దీని ధర 3.6 కోట్ల రూపాయలు అని తెలిపింది. ప్రతిష్ఠాత్మక రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ధర 9 కోట్ల రూపాయలు కాగా, ప్రస్తుతం ఈ కారు ధర 7.8 కోట్ల రూపాయల నుచి 8.0 కోట్ల రూపాయలు అని ఆ సంస్థ ప్రకటించింది. అలాగే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ధర గతంలో 5.25 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం దీని ధర 4.75 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అలాగే మరో లగ్జరీ కార్ల సంస్థ ఆస్టన్ మార్టిన్ డీబీ11 కారు ధర గతంలో 4.27 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం దాని ధర 4.06 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దీంతో భారత్ లో లగ్జరీ కార్ల కొనుగోళ్లు ఊపందుకుంటాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

More Telugu News