: పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ యాగ వేణుగోపాల్‌రెడ్డి(వైవీరెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లధనం, అవినీతిపై నోట్ల రద్దు ప్రభావం అంతగా లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలిక ఆర్థిక ప్రభావం, నల్లధనం, అవినీతిపై ప్రత్యక్ష, తక్షణ ప్రభావం కూడా నామమాత్రమేనని తేల్చి చెప్పారు. నోట్ల రద్దు కారణంగా భవిష్యత్తులో వ్యవస్థాగతంగా కూడా కొత్త చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే నోట్ల రద్దు కారణంగా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగినట్టు చెప్పారు. పెద్దనోట్ల రద్దుతో కోట్లాది మంది ప్రజలు తమ తప్పేమీ లేకపోయినా రెండు నెలలపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. బహుశా ఏ దేశంలోనూ ఇలా జరగలేదని, ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మౌనంగా భరించారని అన్నారు.

More Telugu News