: ఇదీ... కొంపల్లి టీఆర్ఎస్ ప్లీనరీలో మెనూ, ఖర్చు!

హైదరాబాదు శివార్లలో టీఆర్ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్లీనరీకి 15,000 మంది టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. వీరందరికీ 26 రకాల వంటకాలతో పసందైన విందు భోజనం అందించారు. ఈ విందు భోజనానికి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చయినట్టు తెలుస్తోంది.

ఇంత ఖర్చు చేసిన ఈ విందులో ఏమేం వడ్డించారంటే... 2,500 కిలోల మటన్‌ తో దమ్‌ కా బిర్యానీ... 3000 కేజీల చికెన్‌ తో దమ్‌కా బిర్యానీ... 15 వేల గుడ్లతో కోడి గుడ్డు పులుసు... 200 కేజీల చేపల ఫ్రై... 200 కేజీల రొయ్యల ఫ్రై.... 700 కేజీల మటన్ తో కూర... 300 కేజీలతో మటన్‌ దాల్చా... 200 లీటర్ల పాలతో పైనాపిల్‌ ఫిర్నీ స్వీట్‌... ఫ్లమ్‌ కేక్‌ ఐస్‌ క్రీమ్‌ తో పాటు వెజ్ (శాకాహారం) అతిథుల కోసం మిర్చీకా సాలన్, ఆలు గోబీ, టమాటా కుర్మా, గంగవాయిలి కూర పప్పు, వెజ్‌ దాల్చ, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు, దోసకాయ చట్నీ, ఫ్రూట్‌ సలాడ్, ఐస్‌ క్రీం ను వడ్డించారు. ఈ మొత్తం వంటకాలను కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నల్లకుంట ప్రాంతానికి చెందిన స్పందన క్యాటరర్స్ తయారు చేయడం విశేషం. 

More Telugu News