: స్పాట్ ఫిక్సింగ్ లో బుక్కైన పాక్ క్రికెటర్... ఐపీఎల్ కు పోటీ పీఎస్ఎల్ లీలలు

బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు పోటీగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్పాట్ ఫిక్సింగ్ తో దద్దరిల్లుతోంది. ఈ లీగ్ ను విజయవంతం చేసేందుకు ప్రపంచ దేశాల క్రికెటర్లను రప్పించి మరీ పీసీబీ యూఏఈలో టోర్నీ నిర్వహిస్తోంది. అంతే కాకుండా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుండగా, అంతకంటే ముందే ఫ్రిబ్రవరిలో ఈ టోర్నీ నిర్వహించేలా పీసీబీ ప్రణాళికలు రచించింది. అయితే ఈ లీగ్ ను సొంత దేశం ఆటగాళ్లే స్పాట్ ఫిక్సింగ్ తో పాతరేస్తున్నారు. ఇప్పటికే ఈ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ ఖలీద్‌ లతీఫ్, షర్జీల్‌ ఖాన్, పేసర్‌ ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఆరోపణలు ఎదుర్కొంటుండగా, తాజాగా ఈ జాబితాలో షహజైబ్‌ హసన్‌ కొత్తగా చేరాడు. అతని బ్యాటింగ్ విధానాన్ని పరిశీలించిన పాకిస్థాన్ పీఎస్ఎల్ అవినీతి వ్యతిరేక శాఖ విచారణకు హాజరుకావాలని, అతని స్పాట్ ఫిక్సింగ్ కు సంబంధించిన వివరాలు అందజేయాలని పీసీబీని ఆదేశించింది. 

More Telugu News