: నిజజీవితంలో నేను, చైతూ ఎలా ఉంటామో ఈ సినిమాలో ఆ రెండు పాత్రలు అలా ఉంటాయి: నాగార్జున

నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, నిజ జీవితంలో తాను, నాగ చైతన్య ఎలా ఉంటామో.. ఈ చిత్రంలో చైతూ, జగపతిబాబు పాత్రలు అలా ఉంటాయని అన్నారు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని దర్శకుడు కల్యాణ్ కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారని, ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిందని అన్నారు. అనంతరం, నాగ చైతన్య మాట్లాడుతూ, ఈ సినిమా చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ సినిమా చూసి నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అన్నాడు.

More Telugu News