: నాకూ కులాభిమానం ఉంది, జగన్ తో వెళ్లాలని ఉంది... కానీ..!: చంద్రబాబు ముందు జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా పామిడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఒక్కరికీ కులాభిమానం ఉంటుందని, లేదని ఎవరైనా చెబితే, వారు అబద్ధం చెప్పినట్టేనని, తనకూ కులాభిమానం ఉందని అన్నారు. "నాకూ జగన్ పక్కన పోవాలనే ఉంది.  ఏం చేస్తారు మరి జగన్? ఏమీ చేయడు. వాడు వెధవ. ఐయాం సారీ. వెధవ అనడం కూడా తప్పేమో. వద్దు.. వెధవ అనే మాట ఉపసంహరించుకుంటున్నా. ఏమీ చేయలేడు. విధిలేని పరిస్థితుల్లో నేనీ తెలుగుదేశం పార్టీలో చేరాను.

ఇప్పుడు చెబుతున్నా.. ఒకవేళ ఎవరికి ఏదున్నా... ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఇవాళ ఉన్న లీడర్స్ లో హీ ఈజ్ ది మ్యాన్. ఈయన ఒక్కడికే ఆ యోగ్యత, శక్తి ఉంది. అందువల్లే తెలుగుదేశంలో చేరాను తప్ప, ఈయనేదో మంత్రి పదవి ఇస్తాడని నాకెప్పుడూ లేదు" అన్నారు.

ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో తెలియదుగానీ, రాష్ట్రానికి చంద్రబాబు మంచి చేస్తున్నారని కితాబిచ్చారు. నీళ్ల విషయం అడిగితే 'యస్' అంటారని చెప్పారు. చంద్రబాబు చెప్పిన పనులన్నీ చేస్తే, నిజంగా అనంత జిల్లా సస్యశ్యామలం అవుతుందని, అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. అప్పో సప్పో చేసి, బంగపోయో, బతిమాలో ఈ పనులను జరిపించాలని, ఈ పనులు ఇప్పుడు కంప్లీట్ అవుతాయన్న నమ్మకం తనకు లేదని, మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, అప్పటికి నీరు వస్తుందని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

More Telugu News