: చిరంజీవి చంద్రబాబునాయుడు... ఎందుకంటే: జేసీ దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా పామిడిలో జరుగుతున్న బహిరంగ సభలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించారు. "చిరంజీవి చంద్రబాబునాయుడు.." అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తాను ఎందుకు ముఖ్యమంత్రిని చిరంజీవి అంటున్నానో తెలిపారు. "ఆయనకేమో 68వ జన్మదినోత్సవం. నాకేమో 72. అందుకనే వారిని చిరంజీవి అని సంబోధిస్తున్నా" అన్నారు. నీటి విషయంలో చంద్రబాబు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని, ప్రజలంతా కూడా మెచ్చుకుంటున్నారని అన్నారు. హంద్రీనీవా నీటిని మూడు నెలల్లో తెస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, ఈ పని జరగాలంటే అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకూ, అంతకుమించి దేవుడి ఆశీస్సులు కావాల్సి వుందని చెప్పారు. రాష్ట్రానికి పోలవరం అత్యంత ప్రధానమైన ప్రాజెక్టని, నెహ్రూ నుంచి చంద్రబాబు వరకూ కలలు కన్న ప్రాజెక్టని అన్నారు. తన శక్తి యుక్తులతో పోలవరం ప్రాజెక్టును సాధించిన చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు.

More Telugu News