: నవాజ్ షరీఫ్ కు పదవీ గండం?

అక్రమ పద్ధతులు, మనీ లాండరింగ్ ద్వారా పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారంటూ పనామా పత్రాల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు పాకిస్థాన్ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఒకవేళ షరీఫ్ కు వ్యతిరేకంగా తీర్పు వెలువడితే ఆయనకు పదవీగండం తప్పకపోవచ్చు. మరోవైపు, వచ్చే ఏడాది పాక్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ కు అత్యంత కీలకం కానుంది.

1990లలో రెండుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ మనీ లాండరింగ్ ద్వారా భారీగా ఆస్తులు పోగేశారని తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ షరీఫ్ ను పదవి నుంచి తొలగించాలని పిటిషన్ లో ఆయన కోరారు. పనామా పత్రాల్లో సైతం ఈ విషయం వెలుగు చూసిందని పేర్కొన్నారు.

More Telugu News