: జైన గురువు అంత్యక్రియల నిర్వహణను రూ. 33.5 కోట్లతో కొనుగోలు చేసిన గుజరాతీ

పరమపదించిన జైన గురువు జయంత్ సేన్ సురీశ్వర్ జీ మహారాజ్ సాహెబ్ అంత్యక్రియలు ఎవరు నిర్వహించాలన్న విషయమై వేలం పాట పెడితే, గుజరాత్ కు చెందిన ప్రముఖ వ్యాపారి రూ. 33.5 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చాడు. 81 సంవత్సరాల మహారాజ్ సాహెబ్ సోమవారం నాడు మరణించగా, అంత్యక్రియల్లో భాగంగా పార్థివదేహానికి కొరివి పెట్టే అవకాశాన్ని భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు. ఆఖరి స్నానం చేయించడం, గంధం పూయడం వంటి ఇతర కార్యక్రమాలు చేసేందుకు వేసిన వేలంలో రికార్డు స్థాయిలో రూ. 57 కోట్లు పోగయ్యాయి.

జైన వర్గంలో ఎవరైనా గురువు మరణిస్తే, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది తరలివస్తారు. ఆ గురువుకు ఎంతమంది అనుచరులు, శిష్యులు ఉన్నారన్న అంశంపై ఆధారపడి, అంత్యక్రియల క్రతువులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇక ఎంత మందికి జైన దీక్షను ఇచ్చారన్న సంఖ్యపైనా సదరు గురువు పేరు ప్రఖ్యాతులు ఆధారపడి వుంటాయి. మహారాజ్ సాహెబ్, సుమారు 200 మందికి దీక్షను ఇచ్చారని ఆయన శిష్యులు వెల్లడించారు.

More Telugu News