: గాంధీ హత్య కన్నా బాబ్రీ మసీదు విధ్వంసం తీవ్రమైన నేరం.. అసదుద్దీన్

మహాత్మాగాంధీ హత్య కంటే బాబ్రీ మసీదు విధ్వంసం తీవ్రమైన నేరమని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. గాంధీ హత్య కేసును రెండేళ్లలో పూర్తిచేశారని పేర్కొన్న ఆయన, బాబ్రీ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ, బాబ్రీ మసీదు కూల్చివేత జాతి సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు.

1992లో బాబ్రీ విధ్వంసానికి కారకులైనవారే నేడు దేశాన్ని పాలిస్తున్నారన్నారని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో బీజేపీ అగ్రనేతలైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతిలు బాబ్రీ విధ్వంసం కుట్రలో భాగస్వాములన్న విషయం తేటతెల్లమైందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితులు మంత్రి పదవులు అందుకోవడంపై విచారం వ్యక్తం చేసిన ఒవైసీ కొందరు పద్మవిభూషణ్‌లు కూడా అందుకున్నారని ఆరోపించారు.

More Telugu News