: ఇదేమి ఇంగ్లిష్?... హైకోర్టు తీర్పు అర్థం కాక.. కేసును పక్కన పెట్టేసిన సుప్రీంకోర్టు!

ఓ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు తల పగలుగొట్టుకున్నా అర్థం కాకపోవడంతో సుప్రీంకోర్టు ఏకంగా తీర్పునే పక్కనపెట్టేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో భూమి యజమానికి, కౌలుదారుడికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు యజమానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

కేసు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పు పత్రాల్లోని భాష ఎంత గింజుకున్నా అర్థం కాకపోవడంతో కేసును పక్కన పెట్టేస్తున్నట్టు పేర్కొంది. తీర్పును సక్రమంగా రాసి పంపాలంటూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అరుణాచల్‌ప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. ఇంగ్లిష్‌ను ఎలా రాయకూడదో చెప్పేందుకు హైకోర్టు తీర్పు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయనిపుణులు విమర్శిస్తున్నారు.

More Telugu News