: నిజం చెబితే ఇలాగే జరుగుతుంది... నేను హైకోర్టుకెళ్తా: జవాను తేజ్ బహదూర్ ఆవేదన

వాస్తవాలు మాట్లాడితే ఇలాగే జరుగుతుందని జవాను తేజ్ బహదూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. క్రమశిక్షణారాహిత్యం కింద అతనిని సస్పెండ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనపై తీసుకున్న చర్యలపై తాను హైకోర్టుకు వెళ్తానని అన్నారు. తనకు చట్టంపై నమ్మకం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. నిజాలు మాట్లాడితే ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఇక్కడ అలాగే జరుగుతోందని తేజ్ బహదూర్ తెలిపారు.

సరిహద్దుల్లో కాపలా ఉండే తమకు నీళ్ల లాంటి పప్పు, మాడిపోయిన చపాతీలు పెడుతున్నారంటూ తేజ్ బహదూర్ 2016లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్మీకి సంబంధించిన విషయాలు వెల్లడించాడంటూ అతనిపై క్రమశిక్షణా చర్యల పేరిట సస్పెన్షన్ వేటు వేశారు. 

More Telugu News