: మే 10 నాటికి 900 ఎకరాల మాస్టర్ ప్లాన్ సిద్ధం: మంత్రి నారాయణ

వచ్చే నెల 10 వ తేదీ నాటికి 900 ఎకరాల రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ రోజు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మున్సిపల్ శాఖకు మొదటి ఈఏపీ ప్రాజెక్టు లభించిందని, ఏషియన్ ఇన్ ఫ్రా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ నుంచి రూ.3,700 కోట్ల రుణం అందుతుందన్నారు. ఈ రుణంతో మొత్తం నలభై మూడు మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల నిమిత్తం ఈ రుణం తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే, ఈ రుణంలో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచామని, వచ్చే మార్చి నాటికి పది పట్టణాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నట్టు చెప్పారు.

More Telugu News