: తెలంగాణ మంత్రి జగదీశ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం

నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఎంతమాత్రమూ ప్రొటోకాల్ ను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ అండతోనే అధికారులు ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను పక్కన బెట్టి అవమానిస్తున్నారని కోమటి రెడ్డి వ్యాఖ్యానించడంతో, ఆయన్ను జగదీశ్ అడ్డుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. ఓ దశలో ఇద్దరి మధ్యా నువ్వెంతంటే నువ్వెంత? అంటూ మాటల యుద్ధం జరిగింది. ఈ దశలో అక్కడే ఉన్న నేతలు కొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సమావేశం నుంచి వెలుపలికి వచ్చిన కోమటిరెడ్డి, మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రజలే వారికి బుద్ధి చెబుతారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు.

More Telugu News