: ట్రిపుల్ తలాక్ సరే... హిందూ సంప్రదాయంలో భాగమైన 'సతీ ప్రథ' ను అమలు చేయండి: ఆజంఖాన్

షరియా చట్టాల్లో భాగంగా, మహిళలకు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించిన ట్రిపుల్ తలాక్, నిఖా హలాల్ తదితరాలపై నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ముస్లిం మహిళలు డిమాండ్ చేస్తున్న వేళ, యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ స్పందించారు. ట్రిపుల్ తలాక్ వద్దని భావించే వారు, హిందువుల్లో అనాదిగా అమలై, ఆపై ఆగిపోయిన 'సతీ ప్రథ' సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. భర్త చనిపోయిన తరువాత విధవరాలైన భార్య కూడా మృతదేహంతో పాటు సజీవదహనం అయ్యే సతీ సహగమనమే 'సతీ ప్రధ'. దీన్ని 19వ శతాబ్దంలోనే నిషేధించారన్న సంగతి తెలిసిందే.

"ట్రిపుల్ తలాక్ పై చట్టాలు తేకుండా ఆయన్ను ఎవరు ఆపుతున్నారు? 'సతీ ప్రథ'ను ఏ ముస్లిమైనా వ్యతిరేకించారా? ఈ విషయాన్ని ముందు చెప్పండి. హిందూ సంప్రదాయంలో భాగమైన 'సతీ ప్రథ'ను ముందు అమలు చేయండి" అని ఆయన అన్నారు. ట్రిపుల్ తలాక్ పై మాట్లాడని వారెవరైనా, తలాక్ చెప్పి కట్టుకున్న ఇల్లాలికి అన్యాయం చేసే వారితో సమానమేనని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆజం ఖాన్ ఈ మాటలన్నారు.

More Telugu News