: గేల్, కోహ్లీ సూపర్ బ్యాటింగ్...పోరాడి ఓడిన గుజరాత్

రాజ్‌ కోట్‌ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులు ఎదురు చూసే పసందైన విందుపంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రాంభించిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు క్రిస్ గేల్ (77), కెప్టెన్ కోహ్లీ (64) శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ చెలరేగి ఆడారు. ఈ టోర్నీలో తొలిసారి ఫాంలోకి వచ్చిన వీరిద్దరూ గుజరాత్‌ లయన్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అనంతరం వారికి ట్రావిస్ హెడ్ (30), కేదార్ జాదవ్ (38) ఆకట్టుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 213 భారీ స్కోరు చేసింది.

అనంతరం 214 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ కు తొలి ఓవర్ లోనే డ్వెన్ స్మిత్ ను అవుట్ చేసి యజువేంద్ర చాహల్ షాకిచ్చాడు. తరువాత వచ్చిన కెప్టెన్‌ సురేశ్‌ రైనా (23) చెలరేగిపోయాడు. కేవలం 8 బంతులే ఎదుర్కొన్న రైనా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదేశాడు. చాహల్ వేసిన తరువాతి ఓవర్ లో రైనా కూడా అవుటయ్యాడు. అంత వరకు తడబడిన బ్రెండన్ మెక్ కల్లమ్ (72) దూకుడు పెంచాడు. అయితే మరో ఎండ్ లో అరోన్‌ ఫించ్‌ (19), దినేశ్‌ కార్తిక్‌ (1) విఫలం కావడంతో గుజరాత్ ఓటమి ఖాయమైంది. చివర్లో రవీంద్ర జడేజా (23), ఇషాన్‌ కిషన్‌ (39) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోవడంతో భారీ లక్ష్య ఛేదనలో పోరాడిన గుజరాత్ లయన్స్ ఓటమిపాలైంది. 

More Telugu News