: భారతీయులకు శుభవార్త.. ఇకపై రష్యా వెళ్లాలంటే వీసా అవసరం లేదు!

ఇకపై రష్యా దేశంలో పర్యటించాలనుకునే భారతీయులకు వీసా అవసరం లేదు. ఈ విషయాన్ని రష్యా ప్రధాన మంత్రి మెద్వెదేవ్ స్వయంగా ప్రకటించారు. కేవలం, భారత్ కే కాక మరో 17 ఏడు దేశాలకు ఈ అవకాశం కల్పించారు. వీసా అవసరం లేకుండా రష్యాలో పర్యటించేందుకు అనుమతించిన దేశాల్లో యూఏఈ, అల్జీరియా, బహ్రెయిన్, బ్రూనె, కువైట్, ఇరాన్, ఖతార్, చైనా, ఉత్తరకొరియా, మొరాకో, మెక్సికో, ఒమన్, సౌదీ అరేబియా, సింగపూర్, ట్యునీషియా, టర్కీ, జపాన్ ఉన్నాయి.

తూర్పు రష్యాలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పర్యాటక రంగ ఆదాయం పెంచుకునే ఉద్దేశంతోనే రష్యా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా మెద్వెదేవ్ మాట్లాడుతూ, ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించే దేశాలతో వీసా-ఫ్రీ ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. ఆయా దేశాల నుంచి వచ్చే వారికి సంబంధించిన పూర్తి వివరాలతో ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రాంతంలో ఉన్న వ్లాడివోస్టోక్ నౌకాశ్రయంలో ఎటువంటి వీసా అవసరం లేకుండా పర్యటించేందుకు మార్చి నుంచి వీలు కల్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

More Telugu News