: అటువంటి దుస్తులే వేసుకుని రావాలి: ఢిల్లీలోని ఓ మహిళా హాస్టల్

హాస్టళ్లు, యూనివర్సిటీలు, కాలేజీలలో మహిళల పట్ల చూపించే వివక్షకు వ్యతిరేకంగా పోరాడే 'పింజ్రా టాడ్' అనే సంస్థ వాట్సప్‌లో షేర్ చేసిన ఓ నోటీసు వైర‌ల్‌గా మారింది. ఐఐటీ ఢిల్లీలోని ఓ మహిళా హాస్టల్ సిబ్బంది ఈ నోటీసు జారీ చేసింది. తమ హౌస్‌ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మహిళలు ఎటువంటి దుస్తులు వేసుకొని రావాలో అందులో పేర్కొన్నారు. మ‌హిళ‌లు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే, శుభ్రమైన మంచి పాశ్చాత్య లేక‌ భారతీయ దుస్తులు ధరించాల‌ని, అటువంటి దుస్తుల‌తోనే ఈనెల 20వ తేదీన జరిగే కార్య‌క్ర‌మానికి రావాల‌ని ఆదేశించారు.

హౌస్‌ డే కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీ ఐఐటీలో ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. హిమాద్రి హాస్టల్‌ వద్ద వార్డెన్ సంతకంతో ఈ నోటీసు ఉంచారు. ఇటువంటి దుస్తులే వేసుకురావాలంటూ హాస్టల్ వార్డెన్లు ఎందుకంత క‌ఠినంగా ఉన్నార‌ని పింజ్రా టాడ్ సంస్థ సభ్యురాలు ఒకరు నిల‌దీస్తున్నారు. అక్క‌డి హాస్టల్ ముందు ఇటువంటి నోటీసు పెట్టడం ఇదే తొలిసారి.

More Telugu News