: మంత్రులకు ఝలక్ ఇస్తూ, యూపీ సీఎం ప్రవర్తనా నియమావళి... గీత దాటితే వేటే!

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తనదైన శైలిలో దూసుకెళుతున్న యోగి ఆదిత్యనాథ్‌, పాలనలో మరింత పారదర్శకత పెంచి, అవినీతిని తగ్గించే దిశగా, మంత్రులకు సరికొత్త ప్రవర్తనా నియమావళిని తయారు చేశారు. వీటిని పాటించకుంటే వేటు తప్పదని హెచ్చరించారు.

ఇందులో భాగంగా, ప్రభుత్వంతో సంబంధం ఉన్న బంధువులందరి వివరాలనూ మంత్రులు వెల్లడించాల్సి వుంటుంది. వారు తమ పదవులను అడ్డు పెట్టుకుని ఎటువంటి వ్యాపారాలు చేయరాదు. హంగు, ఆర్భాటాలతో జరిగే ఎటువంటి వేడుకలకైనా హాజరు కారాదు. రూ. 5 వేల కంటే ఖరీదైన బహుమతిని ఏ రూపంలో అందుకున్నా దాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. అధికారిక పర్యటనల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే, స్టార్ హోటళ్లలో ఉండరాదు. మంత్రులు తప్పనిసరిగా ప్రభుత్వ నివాసాల్లో మాత్రమే బస చేయాల్సివుంటుంది. కాగా, ఇప్పటికే  మంత్రులు 15 రోజుల్లోగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని యోగి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ గడువు రేపటితో ముగియనుంది.

More Telugu News