: దినకరన్ కేసులో ఆగిన ఢిల్లీ పోలీసుల చెన్నై ప్రయాణం

రెండాకుల గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ, ఎన్నికల కమిషన్ కు రూ. 60 కోట్ల వరకూ లంచం ఇవ్వజూపిన కేసులో అన్నాడీఎంకే నేత, శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ కు కొన్ని రోజుల ఊరట లభించింది. ఆయనపై కేసు పెట్టిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ నిమిత్తం నేడు చెన్నైకి రావాల్సి వుండగా, ఆ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. కేసులో తాము అరెస్ట్ చేసిన మధ్యవర్తి సుకాష్ చంద్రశేఖర్ ను కస్టడీకి తీసుకుని విచారించి, ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు రాబట్టిన తరువాతే దినకరన్ ను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.

అందుకే తమ ప్రయాణాన్ని వారు వాయిదా వేసుకున్నారని, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకుల ద్వారా బట్వాడా జరిగిందా? లేక ఎవరైనా ఢిల్లీకి తీసుకువచ్చారా? అన్న విషయాలతో పాటు దినకరన్ ఫోన్ కాల్స్, సుకాష్ ఫోన్ కాల్స్ రికార్డులు పరిశీలించి పక్కా ఆధారాలు సేకరించి, ఆపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News