: ఏపీలో మొత్తం 18 జిల్లాలు చేయాలని ప్రతిపాదించాం: కేఈ

డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. మధ్యప్రదేశ్ లో ఇప్పటికే ఈ చట్టం అమలవుతోందని చెప్పారు. చుక్కల భూములను క్రమబద్ధీకరణ చేస్తామని తెలిపారు. భూసేకరణ కోసం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చామని... మార్కెట్ రేటు కంటే 150 శాతం పరిహారంగా ఇస్తామని చెప్పారు. అందరికీ పునరావాసం కల్పించిన తర్వాతనే భూసేకరణ చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 18 జిల్లాలు చేయాలని ప్రతిపాదించామని... అయితే, ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేశామని చెప్పారు.  

More Telugu News