: వృద్ధుడిని అతి కిరాతకంగా కాల్చిచంపుతూ.. ఫేస్ బుక్ లో లైవ్ చేసిన హంతకుడు!

సామాజిక మాధ్యమాన్ని అమెరికాలో సాధారణ పౌరులను భయబ్రాంతులకు గురి చేసేందుకు వినియోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అమెరికాలో దారుణాలకు పాల్పడుతూ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. అలాంటి ఘటనే అమెరికాలోని ఓహియో స్టేట్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... స్టీవ్ స్టీఫెన్స్ (37) అనే వ్యక్తి  74 ఏళ్ల వృద్ధుడిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపుతూ ఆ దృశ్యాలను ఫేస్ బుక్ ద్వారా లైవ్ చేశాడు. అంతే కాకుండా అదేరోజు తాను 12 మందిని చంపినట్టు ఫేస్ బుక్ లైవ్ లో వెల్లడించాడు. స్టీవ్ స్టీఫెన్స్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. 

More Telugu News