: సిరియా అయిపోయింది.. ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఈ దేశమేనా?

రష్యా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరియాపై అమెరికా భారీ ఎత్తున దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తత కూడా నెలకొంది. అయినా, ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆసియా ఖండంలో అస్థిరత్వ చర్యలకు పాల్పడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. పొరుగు దేశాలకు చుక్కలు చూపిస్తూ, వరుస క్షిపణి పరీక్షలతో బెంబేలెత్తిస్తున్న ఉత్తరకొరియాకు ముకుతాడు వేసేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారని తెలుస్తోంది.

ఈ దేశంపై సైనిక చర్యలతో పాటు, ఆకస్మిక దాడులకు సైతం వెనుకాడరాదని వైట్ హౌస్ భావిస్తోందట. అయితే, నిన్న ఉత్తరకొరియా నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలమైంది. దీంతో, ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ అస్థిరపరిచే చర్యలకు ఉత్తరకొరియా దిగుతోందని అమెరికా ఆరోపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్తరకొరియా విషయంలో ట్రంప్ తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

More Telugu News