: ఆ గ్రామంలో రాష్ట్రపతి మేకల్ని కాయడానికి వెళ్లాడు...ప్రధాని సరకులు కొనడానికి వెళ్లాడు!

రాష్ట్రపతి మేకల్ని కాయడానికి వెళ్లాల్సిన ఖర్మ ఏంటి? ప్రధాని సరుకులు కొనడానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? కలెక్టర్ పొలానికి నీళ్లు పెట్టడమేంటి? అన్న అనుమానం వచ్చిందా? అవును, నిజమే. 'రాష్ట్రపతి' మేకల్ని కాయడానికి వెళ్తే, 'ప్రధాని' సరకులు కొనడానికి వెళ్లాడు. ఇక, కలెక్టర్ పొలానికి నీళ్లు పెట్టడానికే వెళ్లాడు.. ఇదేంటి? అని చిత్రంగా అనిపించిందా? అయితే చదవండి...

రాజస్థాన్‌ లో రాంనగర్‌ పేరిట ఓ చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 500 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో పుట్టిన పిల్లలందరికీ వెరైటీగా శాంసంగ్‌, కలెక్టర్‌, హైకోర్ట్‌, చిప్‌, సిమ్‌ కార్డ్‌ వంటి చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టుకుని పిలుచుకుంటారు. వారికి కొత్తగా అనిపించిన ఏదైనా సరే అక్కడ ఎవరో ఒకరి పేరుగా స్థిరమైపోతుంది. మొదట్లో ఈ పేర్లు విని అధికారులు షాక్ కి గురయ్యేవారట...ఇప్పుడిప్పుడే ఆ పేర్లకు అలవాటు పడుతున్నారట...ఈ చిత్రమైన సంప్రదాయన్ని వారు కూడా ఆస్వాదిస్తున్నారు. అందరి నోళ్లలో నానాలంటే ఇలాంటి పేర్లే బెటర్ అనిపిస్తోంది కదూ?

More Telugu News