: ఏడాదిగా జీతాలు లేవంటూ రోడ్డెక్కిన 'కేశినేని' ఉద్యోగులు... నాని కార్యాలయం ముందు ధర్నా

గడచిన ఏడాది కాలంగా వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు హఠాత్తుగా ట్రావెల్స్ మూసివేశామని, మరో ఉద్యోగం వెతుక్కోమని చెప్పి ఉపాధి లేకుండా చేశారని ఆరోపిస్తూ, కేశినేని ట్రావెల్స్ సిబ్బంది సమ్మెకు దిగడంతో విజయవాడలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కనీసం ప్రత్యామ్నాయ ఉపాధిని కూడా చూపించలేదని, రాత్రికి రాత్రే సంస్థను మూసివేసి తమను రోడ్డున పడేలా చేశారని వందలాది మంది ఉద్యోగులు, ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించడంతో, ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నాని ప్రస్తుతం విజయవాడలో లేరని, ఆయన వచ్చిన తరువాత సమస్యను గురించి వివరిస్తామని కార్యాలయ సిబ్బంది చెప్పినా సంస్థలో పని చేసిన ఉద్యోగులు తమ నిరసనను విరమించలేదు. పార్లమెంటు సభ్యుడి స్థాయిలో ఉన్న నేత, ఇలా వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొడతారని ఊహించలేదని వారు వాపోయారు.

More Telugu News