: జేసీ రాజీనామా చేయాలని డిమాండ్... అనంత జెడ్పీ సమావేశం రసాభాస!

ఉపాధి పనుల్లో ఎనలేని అవినీతి జరుగుతోందని, కాంట్రాక్టర్లకు జేసీ దివాకర్ రెడ్డి వత్తాసు పలుకుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష నేతలు నిరసనలకు దిగడంతో ఈ ఉదయం ప్రారంభమైన అనంతపురం జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. జిల్లాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొని ఉందని, సమస్యను పరిష్కరించలేని ప్రజా ప్రతినిధులు ఎందుకంటూ వామపక్ష నేతలు అడగడంతో గొడవ ప్రారంభం కాగా, జేసీ, విపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది.

లక్షల రూపాయల ఉపాధి హామీ పనుల నిధులను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని వామపక్ష కౌన్సిలర్లు ఆరోపించడంతో సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి, నిధులు విడుదలయ్యేలా చూస్తానని జేసీ చెప్పినా ఎవరూ వినలేదు. జేసీ రాజీనామాకు పట్టుబట్టి నినాదాలు చేస్తుండటంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లారు.

More Telugu News