: సొంత జట్టు ల్యాప్ టాప్ ను పగలగొట్టిన శిఖర్ ధావన్ షాట్!

నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హైదరాబాద్ జట్టు బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ కొట్టిన ఓ షాట్ కు జట్టు కీలక ప్రణాళికలు, వీడియోలు ఉన్న అత్యాధునిక సోనీ ల్యాప్ టాప్ పగిలిపోయింది. ట్రెంట్ బౌల్డ్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని శిఖర్ ధావన్, బౌండరీ లైన్ ను దాటించగా, అది అనలిస్ట్ శ్రీనివాస్ ముందున్న ల్యాప్ టాప్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొంది. దీంతో ల్యాప్ టాప్ స్క్రీన్ పగిలిపోగా, అది స్విచ్చాఫ్ అయింది. ఈ ఘటనను అత్యంత దగ్గరి నుంచి చూసిన సన్ రైజర్స్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, ఎంత పనిచేశావు? అన్నట్టు ధావన్ వైపు ఓ లుక్కేసి, 'ఎలా చేశాడో చూడండి' అన్నట్టు కోచ్ టామ్ మూడీ, మరో బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ లకు ల్యాప్ టాప్ ను చూపాడు.

More Telugu News