: ఇంతవరకూ ప్రపంచానికి చూపని ఆయుధాలను బయటపెట్టిన ఉత్తరకొరియా

ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఏ క్షణమైనా యుద్ధం జరుగవచ్చన్న భయాందోళనలు నెలకొన్న వేళ, తమ దేశ వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ, ఇప్పటివరకూ ప్రపంచానికి చూపించని సరికొత్త ఆయుధ సంపత్తిని ఆ దేశం ప్రదర్శించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే క్షిపణులను ఉత్తరకొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ముందు పరేడ్ చేసింది. ఉత్తర కొరియాకు ఏప్రిల్ 15 అతి ముఖ్యమైన రోజని, తన తాతయ్య పుట్టిన రోజు వేడుకల్లో కిమ్ జాంగ్ ఉన్ ఉత్సాహంగా పాల్గొన్నారని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా కిమ్ ఇల్ సుంగ్ స్క్వేర్ లో జరిగిన కార్యక్రమంలో గత సంవత్సరం విజయవంతంగా పరీక్షించిన ఖండాంతర క్షిపణులతో పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ చేరుకునేలా తయారు చేసిన దేశవాళీ క్షిపణులను సైన్యం ప్రదర్శించింది. ఈ తరహా క్షిపణులు తమ వద్ద అనేకం ఉన్నాయని తెలిపింది.

More Telugu News