: మినిమమ్‌ బ్యాలెన్స్‌ పై మినహాయింపులు ఇచ్చిన ఎస్బీఐ

అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీల మోత తప్పదంటూ ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఈ బాదుడును అమల్లోకి కూడా తెచ్చింది. దీంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. దీంతో, ఎస్బీఐ కొన్ని సడలింపులను చేసింది. కొన్ని అకౌంట్ల వినియోగదారులకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తిని కలిగించింది. చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, జన్ ధన్ ఖాతాలు గల వారికి మినిమమ్ బ్యాలెన్స్ నుంచి మినహాయింపును ఇస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. అంతేకాక శాలరీ అకౌంట్లకు కూడా మినహాయింపును ఇస్తున్నట్టు తెలిపింది. 

More Telugu News