: ఉత్తరకొరియా సైనిక సత్తా ఇది.. తక్కువగా అంచనా వేస్తే వినాశనమే!

చైనా అండతో వరుసగా అణు ప్రయోగాలు, క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ శత్రు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్. దక్షిణకొరియాకు అండగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతున్నారు. మాతో పెట్టుకుంటే ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికాకే సవాల్ విసురుతున్న ఉత్తరకొరియా సైనిక సత్తా ఏంటో ఓ సారి చూద్దాం.

  • మిలిటరీ మొత్తం బలగం - 12 లక్షలు
  • రిజర్వ్ బలగాలు - 6 లక్షలు
  • క్షిపణులు - 1000 వరకు ఉంటాయి. ఇవి 1300 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. 
  • అణు వార్ హెడ్లు - 15 నుంచి 20 వరకు ఉంటాయని అంచనా. ఎక్కువ ఉన్నా ఆశ్చర్యం లేదు. 
  • రాకెట్ లాంచర్లు - 5,100
  • ఫిరంగులు - 8,500
  • యుద్ధ ట్యాంకులు - 4,100
  • ఎయిర్ డిఫెన్స్ గన్స్ - 11,000
  • యుద్ధ విమానాలు - 940
  • యుద్ధ నౌకలు - 500
  • రక్షణ బడ్జెట్ - రూ. 65,000 కోట్లు
ఉత్తరకొరియా ఇప్పటి వరకు ఐదు అణు పరీక్షలను నిర్వహించింది. ప్రస్తుతం ఆరో పరీక్షకు సిద్ధమవుతోంది. అమెరికా, ఉత్తరకొరియాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడానికి ఇదే కారణం. 

More Telugu News