: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం.. కీలక ఆదేశాలు జారీ!

అక్రమ వలసదారులపై అమెరికా సర్కారు ఉక్కుపాదం మోపింది. సరైన అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న వారిపై కఠిన చర్యలకు యూఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు ట్రంప్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. మధ్య అమెరికాలోని వలస కార్మికులు, సిలికాన్ వ్యాలీలోని భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా తనిఖీలు జరగనున్నాయి. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ అధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే తనిఖీలను ప్రారంభించాలంటూ వీరికి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు, అక్రమ వలసదారుల కేసులను త్వరితగతిన విచారించేందుకు మరికొంత మంది న్యాయమూర్తులను కూడా నియమించనున్నారు.  

More Telugu News