: విద్యార్థుల సమక్షంలో బాహుబలి ప్ర‌భాస్‌, భళ్లాలదేవుడు రానాల మధ్య పోటీ.. మీరూ చూడండి!

త్వ‌ర‌లో విడుద‌ల కానున్న బాహుబ‌లి-2 సినిమా ప్ర‌చారంలో భాగంగా ప్ర‌భాస్, రానా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ త‌మ అభిమానుల‌ను ఖుషీ చేస్తున్నారు. బాహుబలి యూనిట్ చండీగఢ్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడి విద్యార్థుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా అక్కడ బాహుబలి ప్ర‌భాస్‌, భళ్లాలదేవుడు రానా మధ్య ఓ పోటీ పెట్టారు. ఇందుకు సంబంధిన ఓ వీడియోను బాహుబ‌లి టీమ్ తమ ఫేస్‌బుక్ ఖాతాలో ఉంచింది.

మీరు బాహుబలి టీమా? భళ్ళాలదేవుడి టీమా? అంటూ ఆ చిత్రం యూనిట్ అభిమానుల‌ను ప్ర‌శ్నిస్తోంది. ఓ టేబుల్‌పై చేయి, చేయి క‌లిపిన ప్ర‌భాస్‌, రానా ఒక‌రిపై మ‌రొక‌రు పై చేయి సాధించాల‌ని పోటీ ప‌డ్డారు. అయితే, ఈ పోటీలో ఎవరు గెలిచారు? అనే విష‌యాన్ని చూపించకుండానే ఈ వీడియోను ఆపేశారు. ప్ర‌భాస్‌, రానాల మ‌ధ్య జ‌రిగిన ఈ పోటీని మీరూ చూడండి...

More Telugu News