: కుల్ భూషణ్ కు ఉరిశిక్ష విషయంలో భారత్‌ విన్నపాన్ని మరోసారి తిరస్కరించిన పాక్‌

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూష‌ణ్‌పై గూఢ‌చ‌ర్య ఆరోప‌ణ‌లు మోపుతూ పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించ‌డం ప‌ట్ల భార‌త్ చేస్తోన్న విన్న‌తుల‌ని పాకిస్థాన్ తోసిపుచ్చుతూ త‌మ ధోర‌ణిని కొన‌సాగిస్తోంది. కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్ష తీర్పు కాపీని, ఆయనపై దాఖలు చేసిన ఛార్జిషీటు కాపీలను ఇవ్వాల‌ని ఈ రోజు భార‌త్ కోర‌గా, గూఢచ‌ర్యం కేసు కాబ‌ట్టి అలా ఇవ్వ‌డం కుద‌ర‌‌‌దని చెప్పింది. పాక్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తహ్మీనా జంజ్వాకు పాక్‌లో భారత హైకమీషనర్‌ గౌతమ్‌ బాంబేవాలే చేసిన విన్న‌పానికి ఇలా స‌మాధానం వ‌చ్చింది.

గతంలోనూ కుల్‌భూష‌ణ్‌ జాదవ్‌ను కలవాలని 13 సార్లు భారత దౌత్య వేత్తలు కోరగా, పాక్ ఇదే ధోర‌ణి అవ‌లంబిస్తూ అందుకు ఒప్పుకోలేదు. పాక్ ఆర్మీ చట్టాలను పరిశీలించి, కుల్‌భూష‌ణ్‌కు విధించిన మరణశిక్ష తీర్పుపై అప్పీలు చేయాలని ఇండియా యోచిస్తోంది. ఆయ‌న‌కు విధించిన‌ తీర్పు కాపీ చూస్తే ఏ కారణంతో కుల్‌భూష‌ణ్‌కు మరణ శిక్ష విధించారన్నది తెలుస్తుంది. అయితే అవి ఇవ్వ‌డానికి పాక్ అంగీక‌రించ‌డం లేదు.

More Telugu News