: ఉద్రిక్తతకు దారి తీసే కార్యక్రమాల ప్రసారం.. ఎయిర్ పోర్టులో ఛానల్ ఎండీ అరెస్ట్

మత సామరస్యం దెబ్బతినేలా, ఉద్రిక్తతలకు దారి తీసేలా ప్రసారాలు చేస్తున్నారన్న కారణంపై 'సుదర్శన్ న్యూస్' అనే చానల్ సీఎండీ సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం వెలుగు చూసింది. బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలో ఈయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఈ చానల్ లో ప్రసారమైన కార్యక్రమాల వల్ల సంభాల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్న ఆరోపణలతో... ఏప్రిల్ 9వ తేదీన ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశాన్ని ఓ ఎంపీ బుధవారం నాడు రాజ్యసభలో లేవనెత్తారు. ఉద్రిక్తతలకు కారణమైన చానల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో, అదే రోజు రాత్రి చానల్ సీఎండీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

More Telugu News