: బెంగళూరులో రౌడీ షీటర్ ఇంట్లో వంద కోట్ల రూపాయల పాత నోట్లు లభ్యం

బెంగళూరులోని శ్రీరాం నగర్ లో నివాసం ఉంటున్న బాంబు నాగ నివాసంలో వంద కోట్ల రూపాయల పాత నోట్లు లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ మధ్యనే ఒక వ్యాపార వేత్తను కిడ్నాప్ చేసిన బాంబు నాగ... అతని నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా, ఆ పాత నోట్లను ఇచ్చి, ఆయన విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నాగను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా... ఐదో అంతస్తు పైపులైన్ ద్వారా కిందికి దిగి పరారైనట్టు తెలుస్తోంది. లొంగిపోవాలని ఎంత సూచించినా స్పందన రాకపోవడంతో పోలీసులు తాళాలు పగులగొట్టి లోపల ప్రవేశించగా... ఒక అంతస్తులో భారీ ఎత్తున నిల్వ ఉన్న రద్దైన పెద్ద పాత నోట్లను చూసి ఆశ్చర్యపోయారు. ఈ మొత్తం సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.  

More Telugu News